
Brahmasri Samavedam Shanmukha Sarma is a popular person on television in India, and well appreciated for his commentary/discourses on Rudra Namakam, Vishnu Sahasranamam, Sivanandalahari, Soundarya Lahari, Lalitha Sahasranamam, Siva Tatvam, Ganapathi Tatwam, Sri Krishna Tatwam, Ramayanam, Bhagavatam, the Bhagavad Gita, Mahabharatham, Dakshinamurti Tattvam, Sutha Samhitha, Aditya Hrdayam and the kritis of different Vaggeyakaras.
en.wikipedia.org/wiki/Samavedam_Shanmukha_Sarma
en.wikipedia.org/wiki/Samavedam_Shanmukha_Sarma
!!!! మహర్షుల దర్శనానికి నమస్సులు !!!!
వేదాలలో వివిధ సందర్భాలలో కీర్తించబడిన దేవీ సూక్తాలను వేద వ్యాస మహర్షి మార్కండేయ పురాణంలో " శ్రీ దేవి మహాత్మ్యం" పేరుతో అందించారు. " ఇతిహాస వేదం సముపబృంహయేత్ "-అనునట్లు ఈ భాగములోని శ్లోకాలన్నీ వేదసూక్తాల స్వరూపాలే. అంతేకాక నిగమాగమ సమంవ్యంగా బీజాక్షర, మంత్రాక్షర గర్భితాలు. నిశితంగా పరిశీలిస్తే- ఈ గ్రంధం మనలోని రాజ స్తమోగుణమైన రాక్షస ప్రవృత్తిని నశింపజేసి, సత్వగుణాన్ని ప్రవృద్ధంజేసి పరదేవతానుగ్రహార్థం మహర్షిచే అనుగ్రహింపబడిన తత్వనిధి. ఇది బ్రహ్మ విద్య. అంటే- వేదాంత శాస్త్రం. అనగా - వేద ప్రతిపాదిత పరతత్వ నిరూపణే దీని పరమ ప్రయోజనం. సాత్విక తాత్విక రీతిలో దీనిని ఉపాసనకు వినియోగించిన వారికి అవాంతర ప్రయోజనాలుగా ఐహికాభీష్టసిద్ధి చేకూరడమే కాక, క్రమంగా చిత్తశుద్ధి , సుజ్ఞానసిద్ధి ముఖ్య ప్రయోజనాలుగా ప్రాప్తిస్తాయి.
ఈ వైదిక సంప్రదాయాన్ని అనుసరించిన ఉపాసనను ప్రతిష్టించిన మహర్షి తుల్యులు శ్రీ శ్రీ శ్రీ గోపనందనాథులవారు. వారి దర్శన భాగ్యం, వారి వాత్సల్య సౌభాగ్యం అమ్మ దయవల్ల నాకు లభించిన వరాలు. వ్యాసదేవుడు ఈ గ్రంధాన్ని " దేవీ మాహాత్మ్యమ్ " అని స్పష్ఠంగా పేర్కొన్నారు. తరువాత దీనిని తాంత్రిక ప్రయోగభేదాలతో విభజించి వ్యాపింపచేశారు ఉపాసకులు. ఎవరి సంప్రదాయాలు ఎలా వున్నా, నవార్ణమంత్ర స్వరూపిణి ఐన పరదేవతను " నవశతీ"గా ఈ గ్రంధం ద్వారా ఆరాధించడం సత్సంప్రదాయమని నిరూపించిన గ్రంథమిది.
ఇది వేద సంప్రదాయమైన ప్రబోధకంగా ఉంది. సాత్విక ధర్మానుయాయులకు సమర్ధనీయంగా కూర్చబడిన ఈ కూర్పులోని ఔచిచ్యం, ఉపాసనా సిద్ధులైన వీరికి స్ఫురించిన దైవీ సంకల్పం. ఈ గ్రంధాన్ని పరిశీలించి, పరవశించి పరదేవతను ప్రార్థించడం తప్ప-దీని గురించి వ్యాఖ్యానించి విశ్లేషించే ఉపజ్ఞగాని, ఉపాసనా లలంగానీ నాకు లేవు. సదాచార స్వరూపిణి, దురాచారసమనీ ఐన జగజ్జనని యొక్క దివ్యవాత్సల్యాన్ని ఈ సంప్రదాయానుగుణంగా పరిపూర్నంగా గ్రహించ వచ్చుననడంలో సందేహం లేదు.
శాక్తేయ విద్యను తామసీ రాజసీ స్వరూపాలుగా కాక సాత్విక విద్యగా ఆరాధించడమే పరబ్రహ్మ ప్రాప్తి హేతువు. ఆదిశంకరాచార్యులు ఈ మార్గాన్నే సుష్టుపరచారు. అటువంటి పావన మార్గాన "శ్రీ చండీ నవశతీ మంత్ర మాల" నవాంగ సహితముగా ఆవిష్కరించి, పరదేవతాఅనుగ్రహ కాంక్షలైనవారికి ధన్యులను చేశారు శ్రీ గోపానంద నాథుల వారు. కైవల్య సిద్ధి పొందిన ఈ మహనీయుని సదాశయాన్ని ప్రసరింపజేస్తూ, ఈ గ్రంధాన్ని వెలువరించిన వారి వారసులు ధన్యులు. ఈ దివ్య గ్రంధములో నా ఈ మాట ద్వారా పరదేవతను అర్పించుకొనే భాగ్యము కల్పించినందుకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ .......
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.
25-08-2004